'డకాయిట్-ఏక్ ప్రేమ్ కథ' ఫైర్ గ్లింప్స్ మే 26న రిలీజ్
- May 23, 2025
అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఒక ఎక్సయిటింగ్ అప్డేట్ తో వచ్చారు. 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ మే 26న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్ లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్ ని చూస్తూ కనిపించడం ఫైర్ గ్లింప్స్ పై క్యురియాసిటీని పెంచుతోంది.
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది.
డకాయిట్ కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న మూవీ ఆడియన్స్ కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







