హైదరాబాద్‌కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- May 24, 2025
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ నగరానికి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు (#EV) కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌కు 2 వేల ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సు నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని, ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!