ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- February 11, 2026
యూఏఈ: 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నిలిచింది. 95.2 మిలియన్ల మంది ప్రయాణికులతో ఈ ఘనత సాధించినట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే 3.1 శాతం ఎక్కువ ప్రయాణికుల సంఖ్య నమోదు అయినట్లు పేర్కొంది. ఇది విమానాశ్రయ చరిత్రలోనే అత్యంత రద్దీ సంవత్సరంగా నిలిచిందని తెలిపింది.
DXB చరిత్రలో అత్యంత రద్దీగా ఉండే నెలగా డిసెంబర్ నిలిచింది. 8.7 మిలియన్ల మంది ప్రయాణికులు సేవలు పొందారు. అదే సమయంలో 2025లో 4.95 శాతం పెరుగుదలతో 86.75 మిలియన్ బ్యాగేజీలను నిర్వహించింది. ఇక ప్రయాణీకుల ప్రాసెసింగ్ విషయానికి వస్తే 99.35 శాతం మంది ప్రయాణికులు 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే పాస్ పోర్టు వెరిఫికేషన్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తుంగా, 98.9 శాతం మంది ప్రయాణికుల భద్రతా పరమైన తనిఖీల కోసం వేచి ఉండే సమయం 5 నిమిషాల కంటే తక్కువగా ఉంది.
అదే విధంగా భారత్ 11.9 మిలియన్ల ప్రయాణికులతో DXB యెక్క అతిపెద్ద మార్కెట్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. సౌదీ అరేబియా 7.5 మిలియన్లు, యునైటెడ్ కింగ్‌డమ్ 6.3 మిలియన్లు, పాకిస్తాన్ 4.3 మిలియన్లు మరియు యునైటెడ్ స్టేట్స్ 3.3 మిలియన్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అదే క్రమంలో ట్రాఫిక్ వృద్ధి పరంగా చూస్తే.. చైనా నుండి ట్రాఫిక్ 16.6 శాతం పెరిగి 2.5 మిలియన్లకు, రష్యా 6 శాతం పెరిగి 2.8 మిలియన్లకు, టర్కీ 6.7 శాతం పెరిగి 2.2 మిలియన్లకు, ఈజిప్ట్ 14.3 శాతం పెరిగి 1.8 మిలియన్లకు, మరియు ఇటలీ 12.5 శాతం పెరిగి 1.6 మిలియన్లకు చేరుకుంది.
ఇక లండన్ 3.9 మిలియన్ల మంది అతిథులతో DXB యొక్క అత్యంత రద్దీ నగర గమ్యస్థానంగా నిలిచింది. రియాద్ 3 మిలియన్లతో, ముంబై మరియు జెడ్డా 2.4 మిలియన్లతో, న్యూఢిల్లీ 2.2 మిలియన్లతో ఆ జాబితాలో ఉన్నాయి. DXB మొత్తం 110 దేశాలలోని 291 గమ్యస్థానాలకు కనెక్టివిటీని కలిగి ఉంది. 108 అంతర్జాతీయ విమానయాన సంస్థలు సేవలందిస్తున్నాయని దుబాయ్ విమానాశ్రయాల CEO పాల్ గ్రిఫిత్స్ తెలిపారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









