భారత్‌లో 20 లక్షల మందికి వెబ్ డెవలపర్లగా శిక్షణ ఇవ్వనున్న గూగుల్
- July 11, 2016
ప్రముఖ సెర్చింజిన్ దిగ్గజ కంపెనీ గూగుల్ భారత్‌లో 20 లక్షల మందికి వెబ్ డెవలపర్లగా శిక్షణనివ్వనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ నైపుణ్యత, ధ్రువీకరణ ప్రోగ్రామ్‌ను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌పై సిలబస్‌ను రూపొందించి శిక్షణను అందుబాటులో వుంచనున్నట్లు ప్రొడెక్ట్ వైస్‌ప్రెసిడెంట్ కాసెర్ సేన్‌గుప్తా వెల్లడించారు.
స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా లక్షలాది మంది యువతకు చేరువచేయనున్నట్లు తెలిపారు. తద్వారా మొబైల్ యాప్ అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ కోర్సును జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీలన్నింటిలోనూ అందుబాటులో వుంచనున్నట్లు వివరించారు. ఈ నెల 18 నుంచి ఆండ్రాయిడ్ ప్రాథమికాంశాలకు సంబంధించిన కోర్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు.
గూగుల్ ఈ కోర్సును ఉడాసిటీ, ఎడ్యురేఖ, మణిపాల్ గ్లోబల్, సింప్లీలెర్న్, అప్‌గ్రేడ్ సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లోని అన్ని వర్సిటీల్లో అందించేందుకు ముందుకొచ్చింది.
తాజా వార్తలు
- Dubai ESC Confirms Readiness for Global Village's 31st Season
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







