విడుదలైన 'సెల్ఫీరాజా' సినిమా ట్రైలర్
- July 11, 2016
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన 'సెల్ఫీరాజా' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ విషయాన్ని అల్లరి నరేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. జి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. సెల్ఫీ పిచ్చితో ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే ఈ చిత్రం కథ. 'జేమ్స్‌బాండ్' చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన సోనాక్షి చౌదరి ఇందులోనూ ఆయనతో కలిసి నటించారు. పృథ్వీరాజ్, కిశోర్ గరికపాటి, షకలక శంకర్, ఎం.ఆర్. వర్మ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 15న 'సెల్ఫీరాజా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







