విడుదలైన 'సెల్ఫీరాజా' సినిమా ట్రైలర్‌

- July 11, 2016 , by Maagulf
విడుదలైన 'సెల్ఫీరాజా' సినిమా ట్రైలర్‌

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటించిన 'సెల్ఫీరాజా' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ విషయాన్ని అల్లరి నరేష్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. జి. ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికార్తీక్‌ సంగీతం సమకూర్చారు. సెల్ఫీ పిచ్చితో ఓ కుర్రాడు పడిన పాట్లు ఎలాంటివన్నదే ఈ చిత్రం కథ. 'జేమ్స్‌బాండ్‌' చిత్రంలో అల్లరి నరేష్‌ సరసన నటించిన సోనాక్షి చౌదరి ఇందులోనూ ఆయనతో కలిసి నటించారు. పృథ్వీరాజ్‌, కిశోర్‌ గరికపాటి, షకలక శంకర్‌, ఎం.ఆర్‌. వర్మ, విజయ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 15న 'సెల్ఫీరాజా' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com