ఒమన్ పర్యటనకు చేరుకున్న దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
- May 26, 2025
మస్కట్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉపప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్నారు. ఆయనతోపాటు ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఈ పర్యటనలో భాగమైంది.
ఈ పర్యటనలో షేక్ హందాన్, ఒమన్ సుల్తాన్ మరియు ప్రధానమంత్రి హైథమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకార మార్గాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
విమానాశ్రయంలో షేక్ హందాన్ కు ఒమన్ సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి సయీద్ తయ్యజిన్ బిన్ హైథమ్ తారిఖ్ అల్ సయీద్ స్వాగతం పలికారు.
ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా మైలురాయిగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







