ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన షురూ

- May 26, 2025 , by Maagulf
ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన షురూ

గుజరాత్: ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో రెండురోజుల పర్యటనలో భాగంగా మోదీ వడోదరలో రోడ్‌షోతో పర్యటనను ప్రారంభించారు. త్రివర్ణపతాకాలతో మోదీకి స్వాగతం పలికారు. ప్రధానికి నారీశక్తి స్వాగతం పలికింది.. మోదీకి 30వేల మంది మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా.. గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని మోదీ పాల్గొన్న సింధూర్‌ సమ్మాన్‌యాత్రలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఖురేషీ-వడోదర చెందినవారు. ప్రధాని మోదీ వడోదరలోనే రోడ్‌షో చేయడంతో, ఖురేషీ కుటుంబసభ్యులు- రోడ్‌షోలో స్పెషల్‌గా కనిపించారు.మోదీపై కల్నల్‌ కుటుంబ సభ్యులు పూలవర్షం కురిపించారు. పహల్గామ్‌ ఉగ్రదాడిని కల్నల్‌ సోఫియా ఖురేషీ కుటుంబీకులు ఖండించారు. మోదీ నాయకత్వంలో తమకు గర్వంగా ఉందని సోదరి షాయనా చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com