రాగి వడలు

- July 11, 2016 , by Maagulf
రాగి వడలు

కావాల్సిన పదార్థాలు :
శనగపిండి : అరకిలో నూనె : సరిపడా ఉల్లిగడ్డలు : ఒకటి రాగిపిండి : ఒక కప్పు ఉప్పు : తగినంత పచ్చిమిర్చి : రెండు కరివెపాకు : ఒక రెమ్మ పల్లీలు : 150 గ్రాములు.
తయారు చేసే విధానం:
ఒక పాత్రలో రాగిపిండి, శనగపిండి తీసుకోవాలి. అనంతరం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకును సన్నగా తరుక్కుకోవాలి. వీటిని పిండిలో కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వీటిని కొంచెం కొంచెం నీరు పోస్తూ వడల పిండిగా కలుపుకోవాలి. పల్లీలు వేయించుకుని ఈ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. మూకుడు తీసుకుని నూనె వేయాలి. నూనె వేడయిన తరువాత చిన్న చిన్న పిండిని ముద్దలుగా తీసుకుని చేతితో వత్తుతూ నూనెలో వేయండి. అవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో రుచికరమైన 'రాగి వడలు' రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com