'ట్రూజెట్ ఎయిర్‌వేస్' తొలి వార్షికోత్సవ వేడుకలు
- July 11, 2016
టాలీవుడ్ యువ కథానాయకుడు రాంచరణ్ తేజ భాగస్వామిగా పౌర విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన 'ట్రూజెట్ ఎయిర్‌వేస్' సంస్థకు జులై 12తో ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో మంగళవారం తొలి వార్షికోత్సవ వేడుకలను ఆ సంస్థ నిర్వహిస్తోంది.ఈ నేపథ్యంలో 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' పేరిట ఆ సంస్థ కొత్త ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. గత సంవత్సరం జులై 12న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చెర్రీ ఫ్లైట్స్ ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత రెండు మార్గాల్లోనే విమానాలను నడిపిన ట్రూజెట్... ప్రస్తుతం 5 మార్గాల్లో విమానాలను నడుపుతోంది.విజయవాడ-కడప-విజయవాడ, చెన్నై-కడప-చెన్నై, హైదరాబాగ్-కడప- హైదరాబాదు, కడప-తిరుపతి, హైదరాబాగ్-ఔరంగాబాదు మార్గాల్లో ప్రస్తుతం ట్రూజెట్ విమానాలు సేవలందిస్తున్నాయి.
కాగా, తొలి వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన 'కనెక్టింగ్ ఇండియా ఆఫర్' ద్వారా ట్రూజెట్, లేదా ఏదేనీ ఇతర ఎయిర్ లైన్స్ లో అదే రోజుల ప్రయాణించిన ప్రయాణికులకు రూ.500 విలువ కలిగిన వోచర్‌ను ఆ సంస్థ అందించనున్నట్లు పేర్కొంది. తాను సేవలందిస్తున్న ప్రాంతాలతో దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







