పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!

- May 31, 2025 , by Maagulf
పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!

మనామా: ఓ పెట్ డాగ్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక అరబ్ కుటుంబంతో కలిసి దిగింది. కేవలం మూడు గంటల దూరంలో ఉన్న గమ్యస్థానం నుండి అది వచ్చింది. పెంపుడు జంతువుకు అన్ని ప్రయాణ పత్రాలు ఉన్నాయి. అనుమతులు, ఆరోగ్య తనిఖీలు, విమానాశ్రయ తనిఖీల ద్వారా ఎటువంటి సమస్య లేదని తేలింది. కానీ విమానం దిగగానే ఊహించని మలుపు తిరిగింది. విమానయాన సంస్థ ఆ డాగ్ ను బయటకు పంపేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి ఎటువంటి కారణం చెప్పలేదు. సదరు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దాంతో దాని యజమాని ఫిర్యాదు చేయగా, మైనర్ కమర్షియల్ కోర్టు ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థను BD1,275 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com