బహ్రెయిన్‌లో హానికరమైన ఫిషింగ్ పద్ధతులపై కఠిన చర్యలు..!!

- June 01, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో హానికరమైన ఫిషింగ్ పద్ధతులపై కఠిన చర్యలు..!!

మనామా: నైలాన్ ఫిషింగ్ నెట్‌లకు వీడ్కోలు పలకాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. వాటిని ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఇప్పుడు రెండు అంగుళాల కంటే తక్కువ మెష్ ఉన్న ఏ వలనైనా నిషేధించిందని గుర్తుచేసింది. ఈ కొత్త నిబంధనలు సముద్ర జీవులను రక్షించడానికి, బహ్రెయిన్ సముద్ర వనరుల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయాల్లో భాగమన్నారు.   

మరికొన్ని ముఖ్యమైన నిబంధనలు:

• వలలు 800 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు.

• తీరం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో వలలతో చేపలు పట్టవద్దు.

• ఫ్లోట్‌లతో వలలు కూడా నిషేధించారు.

• సూర్యాస్తమయం, సూర్యోదయం మధ్య నెట్ ఫిషింగ్ నిషేధించారు.

సాంప్రదాయ చేపల ఉచ్చులు (హధౌర్)

కొత్త నిబంధనలు స్థానికంగా హాధౌర్ (వీర్స్) అని పిలువబడే సాంప్రదాయ చేపల ఉచ్చులకు కొన్ని నియమాలను సూచించారు. ఇవి లోతులేని తీరప్రాంత జలాల్లో ఏర్పాటు చేయబడిన పురాతన నిర్మాణాలు, ముఖ్యంగా తక్కువ ఆటుపోట్ల సమయంలో ప్రభావవంతంగా ఉంటాయని తెలిపారు.

కొత్త హాధౌర్ నియమాలు ఇక్కడ ఉన్నాయి:

• భూమి నుండి కనీసం 10 మీటర్ల దూరంలో ఉంచాలి.

• రెండు వీర్‌లను 500 మీటర్ల కంటే దగ్గరగా ఉంచకూడదు.

• మెష్ కనీసం 1.25 అంగుళాల రంధ్రం వ్యాసం కలిగి ఉండాలి.

• ఏదైనా మురుగునీటి ప్రవాహం నుండి 500 మీటర్ల లోపల వాటిని ఏర్పాటు చేయకూడదు.

బోనులు (ఖరగీర్)

బోనులు లేదా ఖరగీర్ కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇవి చేపలకు కనీసం 1.5 అంగుళాలు,  పీతలకు 2.25 అంగుళాల ఓపెనింగ్ పరిమాణాలను కలిగి ఉండాలి. ప్లాస్టిక్, నైలాన్ లేదా చుట్టబడిన ఇనుప ఫ్రేమ్‌లతో తయారు చేసిన బోనులను ఇప్పుడు నిషేధించారు.

సముద్ర జీవుల రక్షణ

* మీరు రక్షిత లేదా ప్రమాదంలో ఉన్న జాతి వాటిని పట్టుకుంటే, దానిని వెంటనే సముద్రంలోకి వదలాలి.

ఈ చర్యలు కేవలం నియమాల కంటే ఎక్కువ అని కౌన్సిల్ స్పష్టం చేసింది. అవి రాబోయే తరాలకు బహ్రెయిన్ సముద్ర సంపదను సంరక్షించడం అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com