హీరో ఆదిత్య నిరాహార దీక్ష విరమించారు

- July 12, 2016 , by Maagulf
హీరో ఆదిత్య నిరాహార దీక్ష విరమించారు

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్‌ సినిమా పతాకంపై కొత్త హీరో, హీరోయిన్లతో విజయ్‌వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. రిలీజ్‌ విషయంలో ఈ చిత్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా గత నాలుగు రోజులుగా చిత్ర యూనిట్‌ చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం విరమించారు. కొంతమంది సినీ ప్రముఖుల జోక్యంతో ఈ చిత్రానికి కొన్ని థియేటర్లు కేటాయించడం, మల్టీప్లెక్స్‌లలో మరిన్ని షోలు వేసేందుకు మార్గం సుగమం కావడంతో నిరాహార దీక్షను విరమించారు.
 
సోమవారం హైదరాబాద్‌ సిటీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ డా|| రాజేంద్రప్రసాద్‌ చిత్ర యూనిట్‌కు నిమ్మరసం తాగించి దీక్షను విరమింప జేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసొసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, భారత్‌ ఎక్తా ఆందోళన్‌ నేషనల్‌ కన్వీనర్‌ మల్లు రమేష్‌, ఇంకా పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఎంతో కష్టపడి చేసిన మా సినిమాను రిలీజ్‌ చేసుకోవడానికి కూడా కష్టాలు పడాల్సి వచ్చిందని దర్శకుడు ఆదిత్య ఓం తెలిపారు. థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయానికి నిరసన తెలియజేస్తూ మేం ఈ నిరాహార దీక్షను చేశాం. తోటి నిర్మాతలు, దర్శకులు మమ్మల్ని ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు కొన్ని థియేటర్లలో మా సినిమా రిలీజ్‌ అయింది. మరికొన్ని థియేటర్లలో కూడా రిలీజ్‌ అవుతుంది. మేయర్‌ రామ్మోహన్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారు ఈ సమస్యను పరిష్కరించి చిన్న సినిమాలకు న్యాయం చేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. మా సినిమా విషయంలో మమ్మల్ని సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆదిత్య ఓం అన్నారు.
 
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com