బహ్రెయిన్ లో భారీగా లైవ్ స్టాక్ దిగుమతి..!!
- June 03, 2025
మనామా: ఈద్ అల్ ఆధా డిమాండ్‌ను తీర్చడానికి బహ్రెయిన్ భారీగా మేకలను దిగుమతి చేసుకుంటుంది. సుమారు 30,630 గొర్రెలు, 91 పశువులు, 34 ఒంటెలను దిగుమతి చేసుకున్నట్లు మునిసిపాలిటీ వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీ ఇంజనీర్ అస్సెం అబ్దుల్ లతీఫ్ అబ్దుల్లా వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రాబోయే రోజుల్లో మరిన్నింటిని దిగుమతి చేసుకుంటామని తెలిపారు. అలాగే , 5,299 టన్నుల పౌల్ట్రీని దిగుమతి చేసుకుంది. లైసెన్స్ పొందిన స్లాటర్ హౌజ్ లలో తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సిత్రాలోని హమాలా, బహ్రెయిన్ లైవ్‌స్టాక్ కంపెనీ స్లాటర్ హౌజులు లైసెన్స్ పొందాయని , అర్హత కలిగిన పశువైద్యుల పర్యవేక్షణలో పనిచేస్తాయని చెప్పారు. అదే విధంగా ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఫహద్ కాజ్వే వంటి కీలకమైన ఎంట్రీ పాయింట్ల వద్ద దాదాపు 25 మంది పశువైద్య నిపుణులు ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!