TTD సీఐఓ గా సాయి ప్రసాద్..
- June 05, 2025
తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ను తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా నియమిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ నెం 1104) జారీ అయ్యాయి. 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
తాజా నియామకంతో సాయి ప్రసాద్ అవసరాన్ని బట్టి టీటీడీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను, కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను కూడా అదనంగా నిర్వహిస్తారని ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. టీటీడీ చరిత్రలో ఇటువంటి పోస్ట్ ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగిన విశేషం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







