బెంగళూరు: సూట్‌కేసులో బాలిక మృతదేహం కేసు..
- June 08, 2025
బెంగళూరు: బెంగళూరులో 17 ఏళ్ల బాలిక మృతదేహం దొరికిన ఘటనలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. మే 21న చందాపురలోని రైల్వే ట్రాక్ పక్కన బ్లూ సూట్‌కేసులో మృతదేహం లభించింది. ఈ కేసును ఛేదించే దిశగా సీసీటీవీ ఆధారాలు కీలకమవుతున్నాయి.రాత్రి 11.51కి ఇద్దరు వ్యక్తులు నిర్మానుష్య వీధిలో సూట్‌కేసు మోస్తూ వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. వారిలో ఒకరు మరలా వెనక్కు తిరిగి వచ్చి చెట్టు వెనకాల ఏదైనా దాచినట్టు కనిపించారు. ఆ తర్వాత వారు మళ్లీ కలుసుకుని, సూట్‌కేసుతో రైల్వే ట్రాక్ వైపు వెళ్లినట్టు మరో ఫుటేజీలో కనిపించింది.
బీహార్‌కు చెందిన ఏడుగురి అరెస్ట్
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.సూర్యానగర్ పోలీసులు బీహార్‌కు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా నవాడా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు ఆశిక్ కుమార్‌కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
హత్యను ఇతర ప్రాంతంలో చేసి ఇక్కడ పడేశారా?
ఇంటిగానే బాలికను హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి రైల్వే ట్రాక్ వద్ద పడేసినట్టు మొదట అనుమానించారు. కానీ, ఇప్పుడు మృతదేహం ఉన్న సూట్‌కేసును క్యాబ్ ద్వారా తీసుకువచ్చి ట్రాక్ వద్ద వదిలేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.బాలిక ఎవరు? ఆమెకు నిందితులతో సంబంధం ఏంటి? హత్యకు కారణం ఏమిటి? ఇవన్నీ ఇంకా గుర్తించాల్సిన అంశాలే. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా, సీసీటీవీ ఆధారాలు విచారణకు నూతన దారులు చూపిస్తున్నాయి. నిజం వెలుగులోకి వచ్చే వరకు ఈ కేసు మరింత ఉత్కంఠనిప్రదంగా మారే అవకాశముంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







