ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్..
- June 09, 2025
ఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అల్లైడ్ సర్వీసెస్ సంస్థ 393 ఉద్యోగాల భర్తీ కోసం పిలుపునిచ్చింది. వాటిలో 227 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులు కాగా 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులున్నాయి.అగ్రిమెంట్ ప్రక్రియలో నిర్వహించే ఈ జాబ్స్ కోసం మూడేళ్ల కాలానికి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూన్ 30 లోగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్ సైట్ https://www.aaiclas.aero అప్లై చేసుకోవాలని కోరారు.
అర్హతలు:
సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు: అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.ఎస్సీ/ ఎస్టీలకు అబ్యర్ధులు కూడా డిగ్రీ పూర్తి చేసి 55 శాతం మార్కులు సాధించి ఉండే బడుంటుంది. ఇంగ్లిష్, హిందీ చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ప్రాంతీయ భాష కూడా వచ్చి ఉండాలి.
అసిస్టెంట్ పోస్టులకు: జనరల్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాదించాలి.
వయోపరిమితి:
సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు: 01.06.2025 నాటికి 27 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీలకు, ఓబీసీ, మాజీ సైనికోద్యోగులకు వయసు సడలింపు ఉంది.
అసిస్టెంట్ పోస్టులకు: 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు, ఓబీసీ, మాజీ సైనికోద్యోగులకు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు: జనరల్, ఓబీసీ వారు రూ.750, ఎస్సీ/ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
అసిస్టెంట్ పోస్టులకు: జనరల్, ఓబీసీ వారు రూ.500, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
వేతన వివరాలు:
సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు: ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది రూ.30000. రెండవ ఏడాది రూ.32000. మూడవ ఏడాది రూ.34000 వరకు జీతం ఉంటుంది. పీఎఫ్, మెడికల్ ఇన్‌స్యూరెన్స్, గ్రాట్యుటీ సదుపాయాలు ఉంటాయి.
అసిస్టెంట్ పోస్టులకు: ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాది రూ.21500. రెండవ ఏడాది రూ.22000. మూడవ ఏడాది రూ.22,500 జీతం ఉంటుంది. అదనంగా టీఏ, డీఏ, పీఎఫ్, గ్రాట్యుటీ, సెలవులు సదుపాయాలు ఉంటాయి. మెడికల్ ఇన్‌స్యూరెన్స్ కోసం ఏడాదికి రూ.10,000 వరకు అందజేస్తారు.
ఎంపిక విధానం:
సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు: విద్యార్హతలు, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, తరువాత శిక్షణకు ఎంపిక చేస్తారు. అందులో ఉత్తీర్ణులైవారిని ఎంపిక చేస్తారు.
అసిస్టెంట్ పోస్టులకు: విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









