తిరుపతి వాసులకు సీప్లేన్ టూర్..
- June 09, 2025
తిరుపతి: తిరుపతిలో కూడా సీప్లేన్ పర్యాటకం అభివృద్ధిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఇందుకు అనుగుణంగా తిరుపతి వాసులకు, తిరుమలకు వచ్చే యాత్రికులకు కొత్త అను భూతిని అందించేందుకు ఆలోచన వేస్తోందని సమాచారం, ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మరింత అభివృద్ధి దిశగా వేస్తున్న అడుగుల్లో తిరుపతిలో సీప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటకరంగం అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, హోటళ్ళు విస్తరణకు పూర్తి అవకాశం ఉంటుందనేది ఆలోచన, ఈ సీప్లేన్ ప్రాజెక్టు ప్రారంభమైతే తిరుపతికి మరింత ప్రచారం లభిస్తుంది. జలాశయాలమీద ల్యాండింగ్ టేకాఫ్ వీలుగా ఇప్పటికే రాష్ట్రంలో శ్రీశైలం-విజయవాడ మధ్య సీప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
శేషాచలం- తిరుపతి – భాకరాపేట అడవుల మధ్యలో.. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ 3. పథకం ద్వారా సీప్లేన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తిరుపతి- చంద్రగిరి సమీపంలోని కల్యాణి డ్యామ్ లో సీప్లేన్ అభివృద్ధిచేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతి వాసులకేగాక ఇక్కడకు వచ్చే యాత్రికులకు కూడా ఈ ఆనందం సాకారం కానుందనేది పర్యాటక వర్గాల సమాచారం ఈ సేవలకు పర్యావరణ అను చట్టం స్థిరంగా మతులు, భద్రతా ప్రమాణాలు, నీటిమట్టం స్థిరంగా ఉండే పరిస్థితులు, ఇతర మౌళిక సదుపాయాలను గమనించనున్నారు. శేషాచలం అటవీప్రాంతంలోని తిరుపతి – భాకరాపేట అడవుల మధ్యలో కల్యాణి డ్యామ్ లో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డ్యామ్ ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ఉంది.ఈ ప్రాంతం అల విమానాశ్రయంగా మారితే భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది..తిరుపతి నగరజనాభా ఐదారులక్షలమందికి పైగానే ఉంది. రోజువారీగా 80వేల మంది వరకు యాత్రికులు అక్కడకు వస్తున్నారు.ఇక తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం రేణిగుంట, బాకరాపేట, పీలేరు, మదనపల్లి, చిత్తూరు తదితర ప్రాంతాల నుండి జనం ఈ సీప్లేన్ ప్రయా డానికి సుముఖత చూపే అవకాశం ఉంది.2026 మార్చిలోపు ఈ సేవలు అందు బాటులోకి రావచ్చనేది సమాచారం, మరీ ఈ ప్రాజెక్టు ఏర్పాటు కు పలు సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







