‘అఖండ 2’ టీజర్ వచ్చేసింది...
- June 09, 2025
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తోంది.ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
నట సింహం బాలయ్య బర్ డే జూన్ 10వ తేదీ.ఈ క్రమంలో అంతకు ఒక రోజు ముందే ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది అఖండ 2 చిత్ర బృందం.తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
బాలయ్య తనదైన శైలిలో డైలాగ్స్‌తో అదరగొట్టారు.‘నా శివుడి అనుమతి లేనిదే..ఆ యముడు కన్నేత్తి చూడడు.. నువ్వు చూస్తావా..’ అంటూ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.
ఇక తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.మొత్తంగా టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.ఇక ఈ టీజర్‌తో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది.14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు.ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







