పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు: ఎంపీ కొనకళ్ల
- July 12, 2016
అమరావతిలో రైతులకు ఇచ్చిన విధంగానే పోర్టు నిర్వాసితులకు ప్యాకేజీలు ఉంటాయని ఎంపీ కొనకళ్ల నారాయణ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం 14వేల ఎకరాలు మాత్రమే సేకరించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణం ద్వారా పరిశ్రమలు వస్తాయని, ఉపాధి పెరుగుతుందన్నారు. పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుని అభివృద్ధి జరుగకుండా వైసీపీ, ఇతర పార్టీలు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో చేయలేనిది...సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వైఎస్ హాయంలో అనేక లక్షల భూములు చేతులు మారాయని ఎంపీ కొనకళ్ల ఆరోపించారు.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







