అహ్మదాబాద్‌లో కూలిన విమానం..
- June 12, 2025
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన వెంటనే దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.ఏడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదం తీవ్రతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. మధ్యాహ్నం 1.39గంటల సమయంలో చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







