దక్షిణ అల్ బటినాలో అతి పొడవైన పర్యాటక వాక్ వే ఆవిష్కరణ..!!

- June 12, 2025 , by Maagulf
దక్షిణ అల్ బటినాలో అతి పొడవైన పర్యాటక వాక్ వే ఆవిష్కరణ..!!

మస్కట్: సౌత్ అల్ బటినా గవర్నరేట్‌లోని నఖల్‌లో అత్యంత పొడవైన పర్యాటక నడక మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ నడక మార్గం చారిత్రాత్మక నఖల్ కోటను ఐన్ అల్ తవారా పార్కుకు అనుసంధానిస్తుంది. ఇది 3 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అనేక నీటి బుగ్గలు, అఫ్లాజ్ (సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు), వాడి నఖల్ ప్రక్కనే ఉన్న వ్యవసాయ గ్రామాల గుండా వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంపొందించడం, నడక మార్గం వెంట ఉన్న గ్రామాలు, పొలాల సహజ, చారిత్రక మైలురాళ్లను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుందని నఖల్ వలీ షేక్ ఖలీఫా బిన్ సలేహ్ అల్ బుసైది చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com