యూఏఈ లో 40 శాతం పెరిగిన మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..!!
- June 12, 2025
యూఏఈ: యూఏఈలో మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కొన్ని సందర్భాల్లో 40 శాతానికి పైగా పెరిగాయి. దీని వలన ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) బీమా సంస్థల ధరల విధానాలు, కవరేజ్ ఎంపికలను బట్టి ఇవి ఉంటాయని తెలిపారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో FNC సభ్యుడు అద్నాన్ హమద్ అల్ హమ్మది ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి మొహమ్మద్ అల్ హుస్సేనిని కలిసి, ఈ విషయంలో నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని కోరారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గిన ప్రయోజనాలు, యువ డ్రైవర్లు, EV యజమానుల నుండి పెరుగుతున్న ఆందోళనలను ఆయన తెలియజేశారు. "బీమా అదనపు ఆర్థిక భారంగా మారింది" అని అల్ హమ్మది అన్నారు. కొన్ని కంపెనీలు థర్డ్-పార్టీ కవర్ కోసం రెట్టింపు వసూలు చేస్తున్నాయని, 15 శాతం వరకు తగ్గింపులను విధిస్తున్నాయని పేర్కొన్నారు.
బీమా రంగాన్ని పర్యవేక్షించే యూఏఈ సెంట్రల్ బ్యాంక్, అన్ని కంపెనీలు కనీస, గరిష్ట రేటు పరిమితులను కలిగి ఉండాలని కోరారు. ప్రమాదం, ఖర్చులు వంటి అంశాలను బట్టి విద్యుత్ లేదా సహజ వాయువుతో నడిచే వాహనాలకు 25 శాతం వరకు తగ్గింపులు అనుమతించబడతాయని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. అయితే, EVల విషయానికి వస్తే బీమా సంస్థలు అనేక సాంకేతిక, లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వాటిలో, అధిక మరమ్మతు ఖర్చులు, విడిభాగాల పరిమిత లభ్యత, ముఖ్యంగా బ్యాటరీలు, సర్టిఫైడ్ సర్వీస్ సెంటర్ల కొరత ప్రధానమైనవి. యూఏఈలో విక్రయించే అనేక EV మోడళ్లకు అధికారిక డీలర్‌షిప్‌లు లేదా వారంటీ కవరేజ్ లేదన్నారు. 2024 వరదలను ప్రమాదానికి కీలక ఉదాహరణగా కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఇక్కడ నీటి వల్ల దెబ్బతిన్న ఎలక్ట్రిక్ వాహనాలకు ఖర్చు అధికమైందని గుర్తు చేసింది. అయితే,అసాధారణ వాతావరణ సంఘటనలు నిరంతర ధరల పెంపును సమర్థించాలా అని అల్ హమ్మది ప్రశ్నించారు. పునరుద్ధరణ సమయంలో వాహనం బీమా విలువను తగ్గించే పద్ధతిని కూడా ఆయన తెలిపారు. యువ డ్రైవర్లు, ముఖ్యంగా 30 ఏళ్లలోపు వారు కూడా యాక్సెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చట్టబద్ధమైన డ్రైవింగ్ వయస్సును 18 నుండి 17 సంవత్సరాలకు తగ్గించినప్పటికీ, కొంతమంది బీమా సంస్థలు ఈ వయస్సు గల డ్రైవర్లకు కవర్ అందించడానికి నిరాకరిస్తున్నాయని చెప్పారు. బీమా ధరలను నియంత్రించడానికి, యూఏఈ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా యూనిఫైడ్ బీమా పత్రానికి అప్డేట్ చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!