అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యంజయుడు..

- June 12, 2025 , by Maagulf
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యంజయుడు..

అహ్మదాబాద్: అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు కూడా బతికి ఉండే అవకాశం లేదని అంతా అనుకున్నారు.వారంతా చనిపోయారని దాదాపుగా ప్రకటించేశారు కూడా. అయితే, విమాన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

కూలిన విమానం నుంచి అతడు సజీవంగా బయటకు వచ్చాడు. అతడి పేరు రమేశ్ విశ్వ కుమార్. వయసు 38 సంవత్సరాలు. 11 ఏ సీటులో కూర్చున్న అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో రమేశ్ కి కూడా గాయపడ్డాడు. ఛాతి, కన్ను, కాలికి గాయాలయ్యాయి.

“టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది” అని రమేశ్ తెలిపాడు. బ్రిటిష్ జాతీయుడైన విశ్వష్ తన కుటుంబాన్ని చూడటానికి కొన్ని రోజులు భారతదేశంలో ఉన్నాడు. తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ (45) తో కలిసి UKకి తిరిగి వెళ్తున్నాడు.

“నేను లేచి చూసేసరికి నా చుట్టూ మృతదేహాలు ఉన్నాయి. నేను భయపడ్డాను. నేను లేచి పరిగెత్తాను. నా చుట్టూ విమానం ముక్కలు ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకువచ్చారు” అని అతడు గుర్తు చేసుకున్నాడు. తాను 20 సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తున్నానని,.. తన భార్య, బిడ్డ కూడా లండన్‌లో నివసిస్తున్నారని విశ్వాష్ తెలిపాడు.

తన సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని అతను చెప్పాడు. “మేము డయ్యూని సందర్శించాము. అతను నాతో ప్రయాణిస్తున్నాడు. నేను ఇప్పుడు అతన్ని కనుగొనలేకపోయాను. దయచేసి అతన్ని కనుగొనడానికి నాకు సాయం చేయండి” అని ప్రాధేయపడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com