భారీగా నార్కొటిక్ పిల్స్ రవాణా..అడ్డుకున్న సౌదీ అధికారులు..!!
- June 13, 2025
అల్-వాడియా: సనా నుండి సౌదీ అరేబియాకు తరలిస్తున్న భారీ నార్కొటిక్ పిల్స్ ను అడ్డుకున్నట్లు యెమెన్ సరిహద్దు అధికారులు ప్రకటించారు. సౌదీ-యెమెన్ సరిహద్దు క్రాసింగ్ వద్ద రిఫ్రిజిరేటెడ్ ట్రక్కు పైకప్పు లోపల దాచిన 1.5 మిలియన్లకు పైగా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్-వాడియా బోర్డర్ క్రాసింగ్‌లోని బోర్డర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ బెటాలియన్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ ఒమైర్ అల్-అజాబ్ మాట్లాడుతూ.. రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులో ఈ పిల్స్ ను దాచి ఉంచినట్లు గుర్తించారు. "పిల్స్ రవాణా యెమెన్ రాజధాని సనాలోని మాదకద్రవ్యాల డీలర్లకు చెందినదని గుర్తించాం. వాటిని సౌదీ అరేబియాలోని షరూరా నగరానికి డెలివరీ చేస్తున్నారు. స్వాధీనం చేసుకుని, వాహన డ్రైవర్ పై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థ అధికారులకు అప్పగించారు." అని బ్రిగేడియర్ జనరల్ అల్-అజాబ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







