భారతదేశానికి సంతాపం తెలిపిన బహ్రెయిన్..!!
- June 13, 2025
మనామా: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టెలిగ్రామ్ పంపారు. ప్రమాదంలో మరణించిన వారి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారుజ ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు.. భారతదేశ స్నేహపూర్వక ప్రజలకు హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇద్దరికీ తన సంతాపాన్ని తెలియజేశారు. అధికారిక టెలిగ్రామ్ తోపాటు ఫోన్ కాల్ చేసి మాట్లాడారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జీసీసీ దేశాలకు పలువురు ప్రమాదంపై దింగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'