చిరంజీవి 150వ సినిమా జులై 18 నుండి సెకండ్ షెడ్యూల్..
- July 13, 2016
చిరంజీవి సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ గా ఎదుగుతున్న తరుణంలో కొన్ని భారీ హిట్స్ అందించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి- విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్'తో పాటు పలు సినిమాలు అప్పట్లో బాక్సాఫీసు సెన్సేషన్ గా నిలిచాయి. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ విజయశాంతి చిరంజీవితో కలిసి 150వ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది.దాదాపు 12 సంవత్సరాలుగా విజయశాంతి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్న ఆమెపై దర్శకుడు వివి వినాయక్ దృష్టి పడింది. చిరంజీవి 150వ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఆమెతో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు ఇటీవల విజయశాంతిని వివి వినాయక్ టీం కలిసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాలో ప్రత్యేక పాత్ర గురించి ఆమెకు వివరించారని, పాత్ర బాగుండటంతో వారి ప్రతిపాదనకు విజయశాంతి కూడా పాజిటివ్ గానే స్పందించారని అంటున్నారు. అయితే విజయశాంతి ఇంకా సైన్ చేయలేదని, రెండ్రోలు ఆలోచించి చెబుతానని చెప్పినట్లు తెలుస్తోంది.అయితే విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆమె పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుందని మాత్రం అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. నయనతారే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. జులై 18 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







