ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

- June 17, 2025 , by Maagulf
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

న్యూ ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు,విద్యార్థులకు సహాయం అందించేందుకు,తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.

విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు.అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడమైనది.

గౌరవ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశానుసారం,తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

సహాయం కోసం ప్రజలు క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు:

వందన,పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్–+91 9871999044

జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్–+91 9643723157

జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్–+91 9910014749

సిహెచ్.చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి–+91 9949351270

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com