TCS కొత్త బెంచ్ పాలసీ
- June 17, 2025
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ఉద్యోగుల కోసం నూతన బెంచ్ పాలసీను ప్రకటించింది. ఇకపై ఒక ఉద్యోగి ప్రాజెక్టుల్లో ఉండకుండా ఖాళీగా గడిపే సమయాన్ని గరిష్టంగా 35 రోజులకు పరిమితం చేసింది. సంస్థ మార్పు లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ఉంది.
ఏటా 225 బిల్లబుల్ డేస్ తప్పనిసరి
TCS తాజా నిబంధనల ప్రకారం, ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 బిల్లబుల్ డేస్ పని చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండి బిజినెస్‌కు విలువ చేకూర్చే విధంగా వ్యవహరించాలి. ఇది ఉద్యోగుల పనితీరును మరింత ప్రాముఖ్యతతో నడిపించేందుకు తీసుకున్న నిర్ణయం. ఇకపై ఎక్కువకాలం ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటం అసాధ్యమవుతుంది.
అప్స్కిల్లింగ్తో పాటు రీజనల్ అధికారులతో సంప్రదింపు
బెంచ్‌లో ఉన్న ఉద్యోగులు ఖాళీగా ఉండకుండా తమ స్కిల్ల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేలా చూడాలని TCS స్పష్టం చేసింది. అందులో భాగంగా యూనిట్ లేదా రీజనల్ RGM (Resource Group Manager)లతో సంప్రదింపులు జరిపి, అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు తీసుకోవాలన్న సూచన చేసింది. దీంతో పాటు స్కిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తక్షణమే కొత్త ప్రాజెక్టులకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది.TCS తీసుకున్న ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!