ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. దాని ధర ఎంత..?
- June 18, 2025
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షి పాస్ ను అందుబాటులోకి తీసుక్చొచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ లో పోస్టు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ విలువ రూ. 3వేలుగా నిర్ణయించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా రాశారు. ‘‘ఒక చారిత్రాత్మక నిర్ణయంలో భాగంగా రూ.3వేలు విలువైన ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు లేదా 200 ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రత్యేక పాస్ నాన్- కమర్షియల్ వాహనాలు (కార్లు, జీపులు, వ్యాన్లు, మొదలైనవి) కోసం మాత్రమే పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి ఈ పాస్ ద్వారా వీలు కల్పించడం జరుగుతుంది’’ అంటూ నితిన్ గడ్కరీ చెప్పారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను యాక్టివేషన్ కోసం త్వరలో ప్రత్యేక లింక్ ను అందుబాటులోకి తెస్తామని గడ్కరీ తెలిపారు. రాజ్మార్గ్ యాత్ర యాప్లో, NHAI, MoRTH అధికారిక వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని జాతీయ రహదారులపై వార్షిక పాస్ పనిచేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!