రష్యన్ ఫేడరేషన్ ప్రాసిక్యూటర్ తో సౌదీ అటార్నీ జనరల్ సమావేశం..!!
- June 20, 2025
సెయింట్ పీటర్స్బర్గ్: అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్-ముజాబ్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యన్ ఫెడరేషన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఇగోర్ విక్టోరోవిచ్ క్రాస్నోవ్తో సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు దేశాల పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య సహకారం, న్యాయ రంగాలలో నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవడానికి, చట్టపరమైన సంస్కృతి, నేరాలను ఎదుర్కోవడంలో.. న్యాయాన్ని సాధించే ప్రయాత్నాలపై సమీక్షించారు.
ఈ పర్యటన సౌదీ అరేబియాలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్, రష్యన్ ఫెడరేషన్ మధ్య బలమైన సంబంధాలను విస్తరిస్తుందన్నారు. న్యాయపరమైన విషయాలలో ఉమ్మడి ప్రయోజనాలను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు తెలిపారు.
2019లో రెండు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం నేపథ్యంలో 2023-2024లో సహకార కార్యక్రమానికి పునాది పడింది. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, దేశాలు- సంస్థల మధ్య భాగస్వామ్య విలువలను పెంచడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ