అనేక దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..!!
- June 20, 2025
యూఏఈ: పలు కారణాలతో ఎయిర్ ఇండియా అనేక దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. దుబాయ్ నుండి భారతదేశానికి రెండు సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. వీటిలో దుబాయ్ నుండి చెన్నైకి AI906 సర్వీస్, దుబాయ్ నుండి హైదరాబాద్‌కు AI2204 సర్వీసులను రద్దు చేసింది.
అదే సమయంలో ఢిల్లీ నుండి మెల్బోర్న్కు AI308, పూణే నుండి ఢిల్లీకి దేశీయ సర్వీస్ AI874; అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి AI456; హైదరాబాద్ నుండి ముంబైకి AI-2872; చెన్నై నుండి ముంబైకి AI571 రద్దైన వాటిలో ఉన్నాయి.
గత వారం జరిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత జరుగుతున్న భద్రతా తనిఖీలు, కార్యాచరణ కారణంగా పలు సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. మరికొన్నింటిని రద్దు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు దాని వైడ్‌బాడీ విమానాల అంతర్జాతీయ కార్యకలాపాలను 15% తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







