షాదాదియా రక్షణ కేంద్రాలలో అగ్నిమాపక దళ చీఫ్ తనిఖీలు..!!

- June 21, 2025 , by Maagulf
షాదాదియా రక్షణ కేంద్రాలలో అగ్నిమాపక దళ చీఫ్ తనిఖీలు..!!

కువైట్: అగ్నిమాపక నియంత్రణ విభాగం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ ఒమర్ అబ్దులాజీజ్ హమద్‌తో కలిసి అల్-షాదాదియా ప్రమాదకర పదార్థాల కేంద్రం, రీసెర్చ్, రక్షణ కేంద్రాన్ని కువైట్ అగ్నిమాపక దళం చీఫ్ మేజర్ జనరల్ తలాల్ అల్-రౌమి తనిఖీ చేశారు. కేంద్రం సంసిద్ధతను సమీక్షించారు. అధిక-ప్రమాదకర సంఘటనలను నిర్వహించడానికి విధానాలను అంచనా వేయడంతోపాటు జరుగుతున్న పురోగతిని అంచనా వేశారు. భద్రతా చర్యలలో భాగంగా సహా రసాయన, జీవ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రోటోకాల్‌లపై కేంద్రం వివరణాత్మక బ్రీఫింగ్‌ను పరిశీలించారు. ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని సమీక్షించారు.

సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్‌లో అల్-రౌమికి కార్యాచరణ విధానాలు, అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించే తాజా సాంకేతికతలు, పరికరాల గురించి వివరించారు. ప్రాణాలను రక్షించడంలో.. అత్యవసర సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడంలో జనరల్ ఫైర్ ఫోర్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు అవసరమని ఆయన అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com