వాహనాల హారన్లలో మార్పులు చేస్తున్నారా? Dh10,000 జరిమానా..!!
- June 21, 2025
యూఏఈ: సమ్మర్ సెలవులు ప్రారంభం అయ్యయి. దాంతో యువ వాహనదారుల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలువురు నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కారు హారన్లు మోగించడం, బిగ్గరగా సంగీతం ప్లే చేయడం,అధిక శబ్దం సృష్టించడానికి వాహనాలలో మార్పులు చేయడం వంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే ప్రవర్తనలు పెరగడంపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇలాంటి చర్యల కారణంగా రాత్రిపూట పిల్లలు మేల్కొనే అవకాశం ఉంటుందని, అలాగే రోగులు, వృద్ధులను ఇబ్బంది పెడతాయని, నిద్ర భంగమై రోజువారీ జీవితాన్ని ఒత్తిడిలోకి నెడుతుందని చెబుతున్నారు. వాహనదారులు కూడా రోడ్లపై ఇలాంటి దూకుడు ప్రవర్తన గురించి ఫిర్యాదు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పెద్దగా వినిపించే మ్యూజిక్, ఆకస్మిక హారన్ల కారణంగా తరచుగా డ్రైవర్ల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతున్నాయని షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నఖ్బీ తెలిపారు.
ఇలాంటి ధోరణిని నివారించడానికి నివాస ప్రాంతాలలో గస్తీని ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ హారన్లను అధికంగా ఉపయోగించే లేదా శబ్దం చేయడానికి తమ వాహనాలలో మార్పులు చేసే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని కఠిన చర్యలు తీసుకున్నట్లు అజ్మాన్ పోలీస్‌లోని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ హుమైద్ బిన్ హిది చెప్పారు.
యూఏఈలో సౌండ్ ఆధారిత ఆటంకాలను సృష్టించే డ్రైవర్లు తీవ్రమైన శిక్షలను ఎదుర్కొంటారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా హారన్లు లేదా మ్యూజిక్ సిస్టమ్‌లను ఉపయోగించడం చేస్తే 400 దిర్హామ్‌ల జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయి. మోడిఫైడ్ లేదా బిగ్గరగా మోగించే వాహనం నుండి శబ్దం వస్తే, జరిమానా 2,000 దిర్హామ్‌లకు పెరుగడంతోపాటు 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు.
ఇంకా, అనుమతి లేకుండా మోడిఫైడ్ చేయబడిన వాహనాలను స్వాధీనం చేసుకోవచ్చు.వాటి యజమానులు 10,000 దిర్హామ్‌ల విడుదల రుసుము చెల్లించాలి. మూడు నెలల తర్వాత రుసుము చెల్లించకపోతే, సదరు వాహనాన్ని వేలంలో విక్రయిస్తారు.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం షార్జాలో 504 జరిమానాలు, అజ్మాన్‌లో 117, ఫుజైరాలో 8 జరిమానాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్‌లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!