సైబరాబాద్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

- June 21, 2025 , by Maagulf
సైబరాబాద్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో  ‘THE ART OF LIVING’ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాలో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన యోగాలో 350 మంది పోలీసు సిబ్బంది హాజరయ్యారు. యోగా సెషన్‌లో శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం, వివిధ ఆసనాలు వేయించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ డా.గజరావు భూపాల్, IPS., మాట్లాడుతూ...“ఈ సంవత్సరం ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే థీమ్‌తో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.  

ఈ కార్యక్రమంలో CAR హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ADCP షమీర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు శ్రీనివాసన్, వెంకట్, శ్వేత, శ్రవణ్, హోంగార్డుల ఇన్‌ఛార్జ్ ఏసీపీ ఇంద్రవర్ధన్, CAR హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ అరుణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు లవకుమార్, నాగరాజు రెడ్డి, వీరలింగం, హిమాకర్, జంగయ్య, ప్రసాంత్ బాబు తదితర పోలీసులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com