దుబాయ్ అల్ ఖుద్రా రోడ్డులో 5 నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!

- June 22, 2025 , by Maagulf
దుబాయ్ అల్ ఖుద్రా రోడ్డులో 5 నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!

దుబాయ్: దుబాయ్ లోని అరేబియా రాంచెస్ జంక్షన్ వద్ద తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలుఅమలులో ఉంటాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ అథారిటీ (RTA) ప్రకటించింది. అల్ ఖుద్రా రోడ్డులోని కూడళ్లను మెరుగుపరచడంలో భాగంగా 5 నెలల పాటు ఈ మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ సామర్థ్యాన్ని పెంచడానికి అథారిటీ వంతెన నిర్మాణ పనులను నిర్వహించనుంది.  
కొన్ని మార్పులు:
-అల్ ఖుద్రా రోడ్డు, అరేబియా రాంచెస్ మరియు దుబాయ్ స్టూడియో సిటీని కలిపే రహదారి కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ను తొలగింపు.
-షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్,  షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మధ్య రెండు దిశలలో వామనాల కదలికలకు అనుమతి.
-రెండు సిగ్నల్ రహిత U-టర్న్ల ఏర్పాటు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com