ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలి..ఒమన్

- June 22, 2025 , by Maagulf
ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలి..ఒమన్

ఇస్తాంబుల్: ఇస్తాంబుల్లో జరిగిన అరబ్ దేశాల లీగ్ కౌన్సిల్ అసాధారణ సమావేశంలో పాల్గొన్న ఒమన్ సుల్తానేట్.. ఇరానియన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి దౌత్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హార్తీ నేతృత్వం వహించారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై ఇజ్రాయెల్ దురాక్రమణను సమావేశం ఖండించింది. ఇది UN సభ్య దేశ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని,  ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు అని ఆక్షేపించింది. ఈ దురాక్రమణను ఆపాలని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి వెంటనే కాల్పుల విరమణను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలను ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిన అవసరం ఉందని తెల్చిచెప్పింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com