బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- March 05, 2026
మనామాః ఇరాన్ ప్రయోగించిన దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్టు బహ్రెయిన్ రక్షణ దళాలు (BDF) ప్రకటించింది. బహ్రెయిన్ గగనతలం, జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 74 బాలిస్టిక్ క్షిపణులను మరియు 117 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించిందని తెలిపింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొని విజయవంతంగా నాశనం చేశాయని పేర్కొంది. ఈ సందర్భంగా బహ్రెయిన్ గగనతలం సురక్షితంగా ఉందని పౌరులు మరియు నివాసితులకు భరోసా ఇచ్చింది.
పౌరులు మరియు నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు జారీ చేసిన గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని కోరారు. సైనిక కార్యకలాపాలను ఫోటో, వీడియో తీయకుండా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయకుండా చేయవద్దని, ప్రభావిత ప్రాంతాలు లేదా అనుమానాస్పద వస్తువులకు దూరంగా ఉండాలని ప్రజలకు అలెర్జ్ జారీచేసింది.
బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి రెసిడెన్షియల్ ప్రాంతాలు మరియు ప్రైవేట్ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఉల్లంఘించడమేనని జనరల్ కమాండ్ తేల్చిచెప్పింది. ఇటువంటి విచక్షణారహిత దాడులు ప్రాంతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







