బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు శుభవార్త..!!
- June 23, 2025
యూఏఈ: బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుభవార్త తెలిపింది. ప్రయాణీకుల సామర్థ్యాన్ని 65 శాతం పెంచడానికి బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్‌ను విస్తరించనున్నారు. విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత స్టేషన్ రోజుకు 220,000 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ప్రకటించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు, ప్రభుత్వ సెలవులు, జాతీయ కార్యక్రమాలు, సెలవు దినాలలో పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది.
విస్తరణలో భాగంగా స్టేషన్ యొక్క విస్తీర్ణాన్ని 6,700 నుండి 8,500 చదరపు మీటర్లకు పెంచనున్నారు. దాంతో స్టేషన్ సామర్థ్యాన్ని గంటకు 7,250 నుండి 12,320 మంది ప్రయాణికులకు పెంచుతుందని RTA డైరెక్టర్ జనరల్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మతార్ అల్ తాయర్ తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో స్టేషన్ సగటున వార్షిక రైడర్‌షిప్ వృద్ధిని 7.5 శాతం నమోదు చేసిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎంట్రన్స్ , పెడస్టేరియన్స్ బ్రిడ్జిలు, కాన్కోర్స్ మరియు ప్లాట్‌ఫారమ్ ప్రాంతాలను విస్తరిస్తారు. అలాగే, అదనపు ఎస్కలేటర్లు, ఎలివేటర్లను అధునీకికరించనున్నారు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచడానికి ఫేర్ గేట్ల సంఖ్యను పెంచడంతోపాటు వాణిజ్య స్థలాలను విస్తరించనున్నారు.
2010లో ప్రారంభించినప్పటి నుండి, బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ స్థిరమైన వృద్ధిని సాధించింది. ప్రయాణీకుల సంఖ్య 2013లో 6.13 మిలియన్ల నుండి 2016లో 7.25 మిలియన్లకు పెరిగింది. 2022 -2024 మధ్య ఈ సంఖ్య దాదాపు రెండు మిలియన్లకు పెరిగింది. గత సంవత్సరం 10.57 మిలియన్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగించుకున్నారు. అంటే ప్రతిరోజూ స్టేషన్లో దాదాపు 58,000 మంది మెట్రో ఎక్కి దిగుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!