ఉమర్ ఖలీఫా హతమయ్యాడు
- July 13, 2016
పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక్ పాఠశాల, బచ్చా ఖాన్ యూనివర్సిటీల్లో దాడుల సూత్రధారి ఉమర్ ఖలీఫా హతమయ్యాడు. పాకిస్థాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉమర్ ను అమెరికా దళాలు అప్ఘానిస్థాన్ లో మట్టుబెట్టాయి. అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఉమర్ తో పాటు అతడి నలుగురు సహాయకులు మృతి చెందినట్టు పెంటగాన్ ధ్రువీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నాంగర్ హర్ ప్రావిన్స్ లో జూలై 9న తమ దళాలు జరిపిన దాడుల్లో ఉమర్, మరో నలుగురు హతమయ్యారని పెంటగాన్ సమాచార ప్రతినిధి పీటర్ కుక్ వెల్లడించారు.ఉమర్ నరైగా పేరుగాంచిన ఖలీఫాకు పలు ఉగ్రవాద దాడుల్లో సూత్రధారిగా ఉన్నాడు. 2014, డిసెంబర్ లో పెషావర్ సైనిక్ పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు. 2015, సెప్టెంబర్ లో బదాబర్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడి, 2016, జనవరిలో బచ్చా ఖాన్ వర్సిటీపై దాడిలోనూ ఉమర్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







