రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కు హీరోయిన్..
- July 14, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మురుగదాస్ మార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ అయితే బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని భావించిన యూనిట్ సభ్యులు చాలా మంది బాలీవుడ్ భామలను సంప్రదించారు. ఒక దశలో పరిణితి చోప్రా ఫైనల్ అయ్యిందన్న వార్త కూడా వినిపించింది. అయితే ఈ బ్యూటి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో మురుగదాస్ టీం వెనక్కు తగ్గారు. ఫైనల్ గా టాలీవుడ్ నయా సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని మురుగదాస్ అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఇంతటి భారీ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు రకుల్ దర్శకుడు మురుగదాస్, హీరో మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







