క్యాబిన్ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు..
- July 14, 2016
దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారికి ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ షాకిచ్చింది. అదనపు క్యాబిన్ బ్యాగులపై రూ. 900 చొప్పున ఛార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దేశంలోని ఆరు మెట్రోల నుంచి ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులకు.. 7 నుంచి 10కిలోల బరువు గల ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్, ఒక పర్సు(మహిళలకు)ను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం ఉంది. అయితే ఇటీవల ప్రయాణికులు తమ వెంట పరిమితికి మించి క్యాబిన్ బ్యాగులను తీసుకురావడం ఎక్కువవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెట్‌ఎయిర్‌వేస్ తెలిపింది. ఆదాయం కోసం తాము ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. ఎక్కువగా క్యాబిన్ బ్యాగులు తీసుకురావడంతో విమానంలో స్టోరేజ్ సమస్య ఏర్పడుతుందని జెట్ పేర్కొంది. దీని వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడటమే గాక.. విమానాల ఆలస్యానికి కూడా కారణమవుతుందని చెప్పింది.
అయితే జెట్‌ఎయిర్‌వేస్ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







