యజమాని తిట్టిందని..తల్లి, కొడుకును చంపేసిన పనిమనిషి
- July 03, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది.తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని, ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా పని మనిషి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.ఢిల్లీలోని లజ్పత్ నగర్లోని ఓ ఇంట్లో ఇద్దరు హత్యకు గురయ్యారు.బుధవారం సాయంత్రం ఇంటి యజమాని రుచిక సెవానీ, ఆమె కొడుకు..పని మనిషి పై కేకలు వేశారు.అంతే కోపం పెంచుకుని.. రుచికను, ఆమె చిన్న కొడుకు గొంతు కోసి చంపేశాడు.అనంతరం అక్కడ నుంచి నిందితుడు పరారయ్యాడు.
బుధవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రుచిక భర్త కుల్దీప్ సెవానీ..ఆఫీసు పని ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపు మూసి ఉండటం గమనించాడు.భార్య, 14 ఏళ్ల కుమారుడు క్రిష్కు ఫోన్ చేశాడు.కానీ ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.కుల్దీప్ సెవానీ గేటు దగ్గర, మెట్ల పై రక్తపు మరకలు గమనించాడు.భయపడి..అతడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి భార్య, కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూసేసరికి భార్య, కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి అవాక్కయ్యాడు. రుచిక (42) మంచం పక్కన నేలపై పడి ఉంది.మొత్తం రక్తంతో నిండి ఉంది.ఇక కుమారుడు క్రిష్ పదో తరగతి చదువుతున్నాడు.బాత్రూమ్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు.
రుచిక సెవానీ తన భర్తతో కలిసి లజ్పత్ నగర్ మార్కెట్లో బట్టల దుకాణం నడుపుతూ ఉంది. దుకాణంలో పని చేసే ముఖేష్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరం నుంచి పారిపోతుండగా ముఖేష్ ను అదుపులోకి తీసుకున్నారు.రుచిక, ఆమె కొడుకు తిట్టినందుకే చంపేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. ముఖేష్ది బీహార్.అమర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి