సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!
- July 03, 2025
కువైట్: భారతదేశంతో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను చర్చించడానికి న్యూఢిల్లీలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాయబారులు కువైట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ప్రస్తుత అధిపతిగా కువైట్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమీక్షించారు. వివిధ రంగాలలో GCC- భారత సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించినట్లు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతార్పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మంచి నేబర్ హుడ్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు ముఖ్యమైన జలమార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత బెదిరింపులపై GCC రాయబారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







