మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

- July 03, 2025 , by Maagulf
మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడులు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మహేశ్వరంలో మలబార్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామన్నారు. మహేశ్వరంలో ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించ బోతున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకో లేదని గుర్తు చేశారు. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి యూనిట్ ఏర్పాటు చేసిన మలబార్ గ్రూప్‌నకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com