సలాలాలోని ఇటిన్ టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- July 06, 2025
మస్కట్: సలాలాలోని విలాయత్‌లో ఇటిన్ టన్నెల్ ప్రాజెక్ట్‌ను ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రారంభించింది. దీనిని వాహనాల రాకపోకలకు తెరిచింది.OMR11 మిలియన్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్ట్.. ధోఫర్ గవర్నరేట్ అంతటా మెరుగైన ట్రాఫిక్ అనుభవాలను అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ధోఫర్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సయీద్ బిన్ మొహమ్మద్ తబుక్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తయిందని, షెడ్యూల్ కంటే దాదాపు 97 శాతం ముందే పూర్తయిందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులో 9 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న రోడ్ల నెట్వర్క్ ఉంది. దాని భాగాలలో 1.35 కిలోమీటర్ల పొడవు గల డ్యూయల్ క్యారేజ్‌వే సొరంగం కూడా ఉంది. 18వ నవంబర్ స్ట్రీట్‌ను 2.7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతి దిశలో నాలుగు లేన్లను విస్తరించారు.
ఈ అభివృద్ధిలో మొత్తం 1.3 కిలోమీటర్ల పొడవున నాలుగు దిశలలో బైపాస్ రోడ్లు, ఏడు సర్వీస్ రోడ్లు , ట్రాఫిక్ ను మెరుగుపరచడం లక్ష్యంగా వివిధ యాక్సెస్, ఎగ్జిట్ పాయింట్ల నిర్మాణం కూడా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







