కనీస వేతనాలు అమలుచేయనున్న కువైట్ ప్రభుత్వం

- July 14, 2016 , by Maagulf
కనీస వేతనాలు అమలుచేయనున్న కువైట్ ప్రభుత్వం

ఆసియా దేశాల నుంచి వెళ్లి ఇంటి పనిమనుషులుగా చేరుతున్న వారికి కువైట్ కనీస వేతనం అమలుచేయనున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకొన్న గల్ఫ్ దేశాల్లో కువైట్ తొలిదేశం అయింది. ఇంటి పనిమనుషులకు కనీస వేతనంగా నెలకు రూ. 13,400 ఇవ్వాలని, ఇతర హక్కులు కూడా కల్పించాలని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ మొహమ్మద్ ఖలీద్ అల్ షబా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని గల్ఫ్ దేశాలన్నీ అమలుచేయాలని హుమెన్‌రైట్స్ వాచ్, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com