సౌదీ అరేబియాలో ఫుడ్ ట్రక్కుల కోసం కొత్త రూల్స్..!!
- July 08, 2025
రియాద్: మొబైల్ వెండింగ్ కార్ట్లు, ఫుడ్ ట్రక్కుల కోసం కొత్త మున్సిపల్ రూల్స్ ను సౌదీ మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రి మజేద్ అల్-హోగైల్ ఆమోదించారు. వీటిలో కార్ట్‌ల లోపల నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం, రాత్రి 12:00 తర్వాత కార్యకలాపాలను నిషేధించడం ఉన్నాయి. ఈ వాహనాల యజమానులకు 180 రోజుల దిద్దుబాటు వ్యవధిని ఇచ్చారు.
ట్రాఫిక్ లైట్లు, సర్కిల్స్, రహదారుల ఎంట్రీ/ఎగ్జిట్ అధిక ట్రాఫిక్ సాంద్రత ఉన్న ప్రాంతాలలో ఫుడ్ ట్రక్స్ కార్యాకలాపాలను నిషేధం విధించారు. పోలీస్, ట్రాఫిక్, సివిల్ డిఫెన్స్, అంబులెన్స్‌లు. వికలాంగుల కోసం పార్కింగ్ స్థలాల కోసం కేటాయించిన ప్రదేశాలలో, అలాగే మునిసిపాలిటీ అనుమతించని ప్రాంతాలలో అమ్మకాలను కూడా కొత్త రూల్స్ లో నిషేధించారు.
అదే విధంగా, డంపింగ్ యార్డులు, మురుగునీటి ప్రదేశాలు, ఇతర పర్యావరణ కాలుష్య కారకాల దగ్గర కూడా వ్యాపారాలను నిషేధం విధించారు. 24 గంటల అనుమతి లేకపోతే 12:00 AM తర్వాత అన్ని కార్యకలాపాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ట్రక్ బయట భోజనం తయారు చేయడాన్ని నిషేధించారు. వంట కోసం బొగ్గు లేదా కట్టెలను ఉపయోగిస్తే, భోజనం లేదా పానీయాలను ప్రత్యేక బండిలో తయారు చేయాలి.
సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ జారీ చేసిన నిబంధనలకు ఆహార సంస్థలు కట్టుబడి ఉండాలని అధికారులు సూచించారు. మే 13-28 వరకు "ఇస్తిత్లా" ప్లాట్‌ఫామ్ ద్వారా మొబైల్ కార్ట్‌ల కోసం ముసాయిదా మునిసిపల్ రూల్స్ ను బహిరంగపరచినట్లు మునిసిపాలిటీలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, ప్రతి ఫుడ్ ట్రక్ సంబంధిత శాఖల అధికారుల నుంచి క్రమం తప్పకుండా అనుమతి పొందాలని నిర్దేశించారు. లేదంటే భారీగా జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







