బాడీ ఫిట్నెస్ కోసం కొత్త విన్యాసం

- July 14, 2016 , by Maagulf
బాడీ ఫిట్నెస్ కోసం కొత్త విన్యాసం

బాడీని ఫిట్ గా ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొత్త ఫీట్ అందుబాటులోకి వచ్చింది. అదే ఆక్వా జుంబా ఫీట్. ఇప్పటిదాకా పెద్ద నగరాలకే పరిమితమైన ఈ ఫీట్ ఇప్పుడు విశాఖకు పాకింది. ఈ ఫీట్ కోసం వచ్చే వారితో విశాఖ సాగరతీరం సందడిగా మారింది. ఇప్పటి దాకా యోగ, జుంబ డాన్సు లకు అలవాటుపడిన నగర వాసులు ఇప్పుడు ఆక్వా జుంబా డాన్స్ కు అలవాటు పడుతున్నారు. నీటిలో చేసే ఈ డాన్సు ఇప్పుడు ఎక్కడ చూసిన హల్ చల్ చేస్తోంది. వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా పాపులర్ అయిన ఆక్వా జుంబాతో విశాఖ ప్రజలు దుమ్ము లేపుతున్నారు. సింపుల్ గా స్విమ్మింగ్ పూల్ లో డీ.జే. సంగీతానికి తగ్గట్టు గంతులేస్తున్నారు. వేసవిలో కేలరీలు తగ్గించి ఫిట్ గా ఉండటానికి ఇది దోహద పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ చాలా బాగుందని, చల్లని నీటిలో సమ్మర్ హీట్ నుంచి సేదదీరుతూనే కాలరీలు కూడా బర్న్ చేసుకోవచ్చని ఈవెంట్లో పాల్గొన్నవారు చెప్తున్నారు. మొత్తంగా ఆరోగ్యం విషయంలో ఈలాంటి ఈవెంట్లు చేయడం మంచిదే అయినా వెస్ట్రన్ కల్చర్ కు ఎక్కువగా అలవాటు పడడం మంచిది కాదనేది పెద్దల మాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com