పెరుగుతో మటన్ బిర్యాని
- July 14, 2016
కావలసిన పదార్దములు :
మటన్ : అరకేజీ , బియ్యం : అర కేజీ , పెరుగు : ముప్పావు లీటర్ , నెయ్యి : కప్పు (వంద గ్రాములు ) , ఉల్లిపాయలు : రెండు ధనియాలపొడి టీ స్పూన్ , దాల్చినచేక్కపొడి : టీ స్పూన్ , మిరియాలపొడి : అర టీ స్పూన్ , లవంగాలు : పది , అల్లంవెల్లుల్లి : టేబుల్ స్పూన్ , ఉప్పు : సరిపడా , నీళ్ళు : కప్పు
తయారుచేయు విధానం :
మటన్ ముక్కలుగా కోసి కడిగి, ఉప్పు, అల్లంవెల్లుల్లి, పసుపు కలిపి గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు అర లీటరు పెరుగు తీసుకోని దానిలో ధనియాలపొడి, యాలుకలపొడి, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి, కప్పు నీళ్ళువేసి బాగా కలిపి మటన్ లో వేసి అరగంట పక్కన ఉంచాలి. ఇప్పుడు పాన్ లో మటన్ మిశ్రమం వేసి సర్దాలి. నెయ్యి వేడి చేసి లవంగాలు వేపి, నేయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి. ఇప్పుడు బియ్యం కడిగి, మిగిలిన పెరుగు బియ్యంలో కలిపి, పాన్ లో వున్న మటన్ మీద వేసి సర్ది, మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మీడియం మంట మిద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సింలో పెట్టి పావు గంట ఉడకనిచ్చి దించాలి. నీళ్ళు లేకుండా పెరుగుతో మాత్రమే వండే మటన్ బిర్యాని రెడి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







